దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్ఛితి, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, కీలక రంగాల్లో షేర్ల అమ్మకాలతో సూచీలు నష్టాల బాటలో పయనించాయి. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 824 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 22,829 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.28గా కొనసాగుతోంది.సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్.బీ.ఐ, మారుతీ సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనీలివర్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Previous Articleసమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం: మంత్రి అనగాని
Next Article ఫిబ్రవరి 3న ‘కన్నప్ప’నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్