దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. రియాల్టీ, ఆటో స్టాక్స్ రాణించాయి. దీంతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 80,636 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 221 పాయింట్లు లాభపడి 24,585 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.66గా ఉంది. సెన్సెక్స్ లో ఎటర్నల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleవీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Next Article మంత్రి కందుల దుర్గేష్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ