ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించిన తిలక్ వర్మ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.2 ఓవర్లలో ఛేదించింది. తిలక్ (72*; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో దూకుడుగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన తిలక్.. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ చివర్లో ఉత్కంఠభరితంగా మారింది. ఈక్రమంలో టెయిలెండర్లతో కలిసి జట్టును గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈనేపథ్యంలో తిలక్ వర్మపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ టీ20 ప్లేయర్ మాత్రమే కాదని.. ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా మారే సత్తా అతనికి ఉందన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు