ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ నేడు రాజ్ కోట్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. ఇక భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తోంది. గత రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం బ్యాటింగ్ లో నిరాశ పరిచాడు. అయితే అతని ఫామ్ పై తమకు ఎలాంటి ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు. సూర్య కుమార్ అత్యద్భుతమైన బ్యాటర్ అని అతనిపై భారీ అంచనాలు ఉంటాయని ప్రతీ మ్యాచ్ లో బాగా ఆడాలని అభిమానులు ఆకాంక్షిస్తారని తెలిపారు. టీ20 ఫార్మాట్లో దూకుడుగా ఆడాలని ఈక్రమంలో త్వరగా అవుటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సూర్య నిర్భయంగా ఆడే నిస్వార్థ క్రికెటర్ అని అలాంటి బ్యాటర్లు అరుదుగా ఉంటారని చెప్పారు. టీమ్ కోసం దూకుడైన ఆటతీరుతో ఆడతాడని అందుకే అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగాడని వివరించాడు. తప్పకుండా సూర్య కుమార్ నుండి మంచి ఇన్నింగ్స్ లు చూస్తామని ఆయన పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు