వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 సమ్మిట్ ను ఫిబ్రవరి 5 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించనున్నారు . ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక తాజాగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో వేవ్స్ బజార్ ఈ-మార్కెట్ ను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వేవ్స్ సృజనాత్మకతకు వేదికగా నిలిచేలా కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. ఇక భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ఈ వేవ్స్ సమ్మిట్ ప్రపంచ వేదికగా నిలవనుంది. మన దేశం సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది.
Previous Articleమరో కీలక మైలురాయికి చేరువైన ఇస్రో: రేపు 100వ రాకెట్ ప్రయోగం
Next Article “సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్”: ఏపీసీసీ చీఫ్ షర్మిల