ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని మోడీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనితో పాటు, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ఈ విషయంపై ముఖ్యమంత్రి యోగితో మాట్లాడినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. నేడు మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈనేపథ్యంలో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం: ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleపెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం
Next Article నా ఇంట్లో రూలింగ్ వైజాగే:హ నాగచైతన్య