ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన వార్త చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన నిర్వహణ లోపమని మండిపడ్డారు. సాధారణ భక్తులకు బదులు వీఐపీల తరలింపుపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం ఈ విషాద ఘటనకు కారణమని రాహుల్ గాంధీ విమర్శించారు. మహా కుంభమేళాకు ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చాలా మహాస్నానాలు జరగాలి. ఈరోజు లాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సౌకర్యాలు మెరుగుపరచాలని స్పష్టం చేశారు. వీఐపీ కల్చర్‌ను అరికట్టాలని, సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కోరారు.
Previous Articleరెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Next Article హరిహర వీరమల్లు…మాట వినాలి బీటీఎస్ వీడియో రిలీజ్