ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం నేడు జరిగింది. ఒప్పందాలపై ఇండస్ట్రీస్ యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు వివరించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి వేగంగా రిజల్ట్స్ చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని సీఎస్ కు తెలిపారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుండి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు టి జి భరత్, కె అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవి కుమార్, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు