ఈరోజు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. రేపు కేంద్ర బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఇక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మహాలక్ష్మి మనకు సిద్ది, బుద్ధిని ప్రసాదిస్తుందని పేదలు సామాన్యులపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వరుసగా మూడో సారి ఎన్డీయేకు ప్రజలు విజయాన్ని అందించారని తెలిపారు. మరోసారి పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ విశ్వాసం నింపుతుంది న్నారు. భారత్ అభివృద్ధే లక్ష్యంగా మిషన్ మోడ్ తో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. నూతన విధానాల పైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం. పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని ఆశా భావం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగనున్నాయి. మొదటి విడతలో నేటి నుండి ఫిబ్రవరి 13 వరకు అలాగే రెండవ విడతలో భాగంగా మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు