రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వీ నటిస్తోంది.అయితే ప్రభాస్ ఇంటి నుండి మంచి రుచికరమైన భోజనం సెట్స్‌కు వస్తుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రభాస్ తన ఆతిథ్యంతో ఊపిరాడకుండా చేస్తాడని సినీ ప్రముఖులు చాలామంది అనేక సందర్భాల్లో చెప్పారు.తాజాగా ప్రభాస్ ఇంటి విందుకు ఫిదా అయినా వారి జాబితాలో ఫౌజీ కథానాయకి ఇమాన్వీ కూడా చేరింది.ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది.
సెట్స్‌లో బ్రేక్ సమయంలో ప్రభాస్ కిచెన్‌లో ఇంటి నుండి వచ్చిన భోజనాన్ని ఇమాన్వీ రుచి చూసింది.ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేస్తూ…ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గ్లింప్స్ షేర్ చేసింది.రుచికరమైన యమ్మీ యమ్మీ భోజనం రుచి చూపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.అయితే ఈ చిత్రం సీతారామం, రాధేశ్యామ్ లైన్‌లో వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందని తెలుస్తుంది.అయితే ప్రభాస్ ఈ చిత్రంతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ – 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలు చేస్తున్నాడు.