నేడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం ముగిసే సమయానికి ఆవిడ బాగా ఆలసిపోయారని మాట్లాడలేకపోయారని అన్నారు. అయితే సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. అవి అభ్యంతరకరమని సోనియా గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలా చేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. మరోవైపు రాష్ట్రపతిని సోనియా అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ అనవసర ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ పేర్కొంది.
Previous Articleరాష్ట్రాన్ని, తెలుగుజాతిని చల్లగా చూడమని ఆ అమ్మవారిని కోరుకున్నా: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం మరియు ఆమోదయోగ్యం కాదు