పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే, కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజుని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించింది.
పెనుగొండలో ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నాను. ఇచ్చిన మాట ప్రకారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాం. రాష్ట్రాన్ని, తెలుగుజాతిని చల్లగా చూడమని ఆ అమ్మవారిని కోరుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
రాష్ట్రాన్ని, తెలుగుజాతిని చల్లగా చూడమని ఆ అమ్మవారిని కోరుకున్నా: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read