పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.ఈ అంశం అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.బీజేపీ సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా,రాష్ట్రపతి భవన్ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు వయనాడ్ ఎంపీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా స్పందిస్తూ…తన తల్లికి రాష్ట్రపతి పట్ల అపారమైన గౌరవం ఉందని,కానీ మీడియా ఆమె వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు.కాగా క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు,దేశాన్ని నాశనం చేసిన బీజేపీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు…అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు.వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.