‘గౌరవంగా చనిపోయే హక్కు’(రైట్ టు డై విత్ డిగ్నిటీ)ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్‌తో కూడా కోలుకోని రోగులకు ఉపశమనం అందించే విధంగా ఈ హక్కును ఇస్తున్నారు. అయితే దీనికి రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని ముగ్గురు డాక్టర్ లు పేషెంట్ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది డాక్టర్లతో పాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు అనుమతి ఇస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్‌ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. అయితే, సంబంధిత పేషెంట్ బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ మొదలవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుండి విముక్తి కల్పించడానికి ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావ్ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

