తన ఇల్లుని క్లీన్ చేస్తున్న యజమాని ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.ఈ మేరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సులో నివసిస్తున్న ఓ వ్యక్తికి తన ఇంటి బేస్‌మెంట్‌లోనే ఆ ఇంటి పాత యజమాని గత 7 ఏళ్లుగా రహస్యంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది.మెట్ల వెనుక అమర్చిన రహస్య తలుపు నుండి బేస్‌మెంట్ లోపలకు వెళితే అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి వాతావరణం కనిపించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక పేర్కొంది. విధంగా వెంటిలేషన్ ఉందని,అంతేగాక ఓ చిన్న బార్ సెటప్ కూడా ఉందని పత్రిక తెలిపింది.అయితే ఈ గదిలోకి ఇటీవలే వచ్చి వెళ్లిన ఆనవాళ్లు కూడా అతనికి కనిపించాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆ ఇంటి యజమాని లీ వెంటనే పాత యజమానికి ఫోన్ చేశాడు. ఈ ఇంటిని విక్రయించినపుడు తనకు బేస్‌మెంట్‌లో ఉన్న రహస్య గది గురించి ఎందుకు చెప్పలేదని లీ పాత యజమాని ఝాంగ్ అనే మహిళను ప్రశ్నించాడు.అయితే ఆమె ఇచ్చిన సమాధానంతో లీ షాక్ అయ్యాడు.ఆమె తాను ఇంటిని మాత్రమే అమ్మానని, బేస్‌మెంట్‌ను కాదని,ఆ గది గురించి సేల్ అగ్రిమెంట్‌లో లేదని అతనికి గుర్తు చేసింది.కాగా ఖాళీ సమయంలో ఆమె ఆ గదిలో రిలాక్స్ అవుతుంటానని కూడా ఆమె షాకింగ్ జవాబు ఇచ్చింది. అయితే లీ కంటపడకుండా 7 సంవత్సరాలుగా ఆమె ఎలా బేస్‌మెంట్‌లోకి వెళ్లి వస్తోందో ఇప్పటికీ అంతుపట్టడం లేదు.అయితే ఆస్కార్ అవార్డును అందుకున్న “పారాసైట్” చిత్ర కథ ఈ ఘటనకు దగ్గరగా ఉంది.