గత శనివారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో లోక్‌సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.లోక్‌సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్‌సభ సచివాలయానికి,338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.ఈ కేటాయింపుల్లోనే సన్‌సద్ టీవీకి కేటాయించిన నిధులూ ఉన్నాయని తెలుస్తుంది.
రాజ్యసభకు ప్రకటించిన 413 కోట్లలో 2.52 కోట్లు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల అలవెన్స్‌లు, జీతాల కోసం కేటాయించారు.వేరుగా కేటాయించిన రూ.3 కోట్లను రాజ్యసభ విపక్ష నేత జీతాలు, అలవెన్స్‌లు, సచివాలయ నిర్వహణకు, రూ.98.84 కోట్లను సభ్యులకు కేటాయించారు.లోక్‌సభ విషయానికొస్తే 1.56 కోట్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల జీతాలు, అలవెన్స్‌ల కోసం కేటాయించినట్లు తెలుస్తుంది.