ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మరిన్ని వందే భారత్ ట్రైన్ లను నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని అందుకే ఏపీ లో ప్రాజెక్టుల గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే 11 రెట్లు ఎక్కువగా ఏపీకి నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో రూ.84,559 కోట్లతో పలు ప్రాజెక్టులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లు వేసినట్లు చెప్పారు. రైల్వే పనులు వేగంగా జరిగేలా ఏపీ సీఎం చంద్రబాబు సహాకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 16 జిల్లాలలో 8 వందే భారత్ ట్రైన్ లు తిరుగుతున్నాయని వాటి సంఖ్య మరింత పెంచుతామని తెలిపారు. అన్ని ట్రైన్ లు 110 కిలో మీటర్ల వేగంతో వెళ్లే విధంగా ట్రాక్ లు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రూట్ లలో 130 కి.మీ 160 కి.మీ వేగంతో వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు గురించి కూడా వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు