అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తొలి నుండి కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.ఈ చర్యల నేపథ్యంలో, అక్రమంగా అమెరికా వెళ్లిన భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిస్తున్నారు.ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ విమానం భారత్ కు బయల్దేరింది.అందులో 205 మంది భారతీయులు ఉన్నారని జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి.ఈ తరలింపుకు సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగిస్తున్నారు.భారత్‌కు చేరుకోవడానికి సుమారు 24 గంటలు పట్టనుందని సమాచారం.
కాగా అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అవలంభిస్తున్న విధానాలపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది.తాము అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టం చేయడంతో పాటు,ఈ అంశం అనేక రకాల సంఘటిత నేరాల ముడిపడి ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవపత్రాలు లేకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత విదేశాంగ శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.అయితే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని సమాచారం.