ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక ఈరోజు , భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర నదీ జలాలలో స్నానమాచరించి పూజలు నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ ఆయనతో పాటు ఉన్నారు. ఈ సారి కుంభమేళాకు మొత్తం మీద 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు