మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో,ఒక విద్యార్థితో మహిళా ప్రొఫెసర్ పూలదండలు మార్చుకొని వివాహమాడిన విషయం నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.ఈ వీడియో పై స్పందించిన వర్సిటీ బృందం విచారణకు పిలుపునిచ్చింది.దాంతోపాటుగా అధికారులు ఆమెను సెలవు పై పంపారు.
ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ పార్థకు లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను పంపారు, తను ఆ బాధ్యతలను కొనసాగించలేనని ఇంకా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని వివరించారు ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం త్వరలో ఆమె రాజీనామా పై నిర్ణయం తీసుకుంది.