శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.సాంకేతిక కారణాల వలన హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాల్సిన విమానం రద్దయింది.ఈ మేరకు ప్రయాణికులకు కనీసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయితే 4 గంటల పైగా విమానాశ్రయంలోనే ఉన్నామని, అధికారులు ఈ అంశంపై స్పందించడం లేదు అని, విమానం క్యాన్సిల్ అయిన విషయం కూడా తమకు చివరి నిమిషంలో వెల్లడించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తున్నారు.
అయితే వివరాల ప్రకారం 47 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్లాల్సిన అలియన్స్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన 91877 విమాన సర్వీసు,విమానంలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. ఈ లోగానే విమానాశ్రయంకు చేరుకున్న ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.కాగా తిరుమల దర్శన సమయం కూడా దాటిపోయిందని ఇంత జరిగిన ఎయిర్పోర్ అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

