మలేషియాలో ఇటీవల జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కుటుంబ సభ్యులతో కలిసి నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ ఆమెకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ గారికి, ట్రైనర్ షాలిని గారికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు