బంగ్లాదేశ్ లో షేక్ హాసీనా అధికార పీఠం దిగిపోయిన తీరు తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. తాజాగా నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. ఆ దేశ జాతిపితగా పరిగణించే షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడిచేసి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు, విధ్వంసం తర్వాత పదవి కోల్పోయి, భారత్ కు వచ్చేసిన అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేక్ హసీనా ప్రసంగిస్తూ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ వెంటనే ఢాకాలో ఆమెకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. ఆమె తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాసంపై నిరసనకారులు దాడికి దిగి, దానికి నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరలవుతున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు కానీ, చరిత్రను కూల్చలేరని, దీనిని వారు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు