ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి వైదొలగనున్నట్లు అర్జెంటీనా ప్రకటించింది.అయితే Covid -19 కట్టడికిచేయడంలో విఫలమవడం, పలు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్జెంటీనా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.ఈ మేరకు అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్ అడోర్నీ ఓ సమావేశంలో మాట్లాడుతూ…ప్రపంచ ఆరోగ్య సంస్థ
నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశారు.అర్జెంటీనా ఏ అంతర్జాతీయ సంస్థను తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు.డబ్లూహెచ్వో స్వతంత్రంగా పని చేయడం లేదని,దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఆరోపించారు.మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 సమయంలో డబ్లూహెచ్వై సరిగా పని చేయలేదని విమర్శించారు.
Previous Articleప్రిన్స్ కరీం అగాఖాన్ IV మృతి: సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
Next Article గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు నెతన్యహూ మద్దతు