ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఇస్మాయిలీ ముస్లిముల 49వ వారసత్వ ఇమామ్ ప్రిన్స్ కరీం అల్ -హుస్సేనీ అగాఖాన్ IV మరణించారు. ఆయన మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన తన జీవితాన్ని సేవ మరియు ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దూరదృష్టి గలవాడని కొనియాడారు . ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత వంటి రంగాలలో ఆయన చేసిన కృషి చాలా మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు . ఆయన కుటుంబానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అనుచరులు మరియు ఆరాధకులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
ఆయన స్విట్జర్లాండ్లో 1936 డిసెంబరు 13న జన్మించారు. విద్యార్థిగా ఉండగా 20ఏళ్లకే ఆయన తాత(ఆగాఖాన్-3) తన వారసుడిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించారు. ఇక 1957లో ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ ఆయనకు ‘హిజ్ హైనెస్’ బిరుదును అందజేశారు. 2015లో భారతప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డుని ప్రదానం చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు