ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కొన్ని వైపులా నుండి దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందించారు. ట్రంప్ నిర్ణయానికి మద్దతు పలికారు. ఆయన ప్రతిపాదనలో తప్పేమీ లేదని అన్నారు. గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. హమాస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా బలగాలను గాజాకు పంపడం ఆ ప్రాంతాన్ని పునరుద్ధరించేందుకు ఆర్థిక సాయం చేస్తానన్నాడు తాను నమ్మలేకపోతున్నట్లు నెతన్యహూ తెలిపారు. ఇక మరోవైపు గాజాలో ఉద్రిక్తతల వలన నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించగా ఆయా దేశాలు ఈ ప్రతిపాదనను ఖండించాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు