బలగం చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు కామెడియన్ & దర్శకుడు వేణు.గ్రామీణ నేపథ్యంతో వచ్చిన “బలగం” చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.ఈ ప్రాజెక్ట్ అనంతరం, వేణు కొత్తగా “ఎల్లమ్మ” అనే సినిమాను చేయబోతున్నాడని ప్రకటించాడు.కాగా “ఎల్లమ్మ” చిత్రంలో నాని లేదా నితిన్ హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.
ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ లేదు.అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా దర్శకుడు వేణు గురించి ఒక అప్‌డేట్ ఇచ్చాడు.”ఎల్లమ్మ” సినిమా కోసం మేము సిద్ధమవుతున్నాము,త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నాడు.ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.దీనితో ఈ చిత్రం ఫిబ్రవరిలో పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.