వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నంగా తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించి తన ఎంపీ పదవికి , వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన రాజీనామా పై వైఎస్ జగన్ స్పందించారు. మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వైసీపీ ఈ రోజు ఉందీ అంటే అది దేవుడి దయ ప్రజల ఆశీస్సులతోనే అని జగన్ అన్నారు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025

