గ్రామ స్వరాజ్యానికి నిదర్శనం… విస్సాకోడేరు గ్రామ పంచాయతీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను గ్రామ స్థానిక సంస్థలు పరిష్కరించడమే స్థానిక స్వయం పరిపాలన అంటారని ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, గ్రామ తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపేలా రూ.10 లక్షల ఖర్చుతో 2 ఫిల్టర్ బెడ్లను మరమ్మత్తు చేయడంతోపాటుగా, నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రం మరమ్మత్తులు చేయడం, నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరులో తమ గ్రామ త్రాగునీటి సమస్యను తామే పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు గ్రామ పంచాయతీనీ, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం, పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా, గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యానికి నిదర్శనం… విస్సాకోడేరు గ్రామ పంచాయతీ: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read
Previous Articleఈనెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు
Next Article సుదీర్ఘ కాలం తరువాత మళ్లీ వచ్చిన ట్రై యాంగిల్ సిరీస్