ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి కూటమి అభ్యర్థి,మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేశారు.కూటమి పార్టీల తరఫున టీడీపీ,జనసేన ,బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రదర్శనగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలసి గుంటూరు కలెక్టరేట్‌కు ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్,శాసన సభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు,ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, కామినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, గల్లా మాధవి, మొహమ్మద్ నసీర్, జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు,భాష్యం ప్రవీణ్, అరవిందబాబు,ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఆలపాటికి రాజేంద్ర ప్రసాద్ కు తోడుగా ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్మికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ కూటమి పిలుపులో భాగంగా జనసేన ఆలపాటికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు ఆలపాటి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయన్నారు.