టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.ఈ మ్యాచ్‌లు మూడో సిక్స్ బాది క్రిస్ గేల్‌ను అధిగమించాడు.గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్.. సకీబ్ మహ్మూద్ వేసిన మరుసటి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టాడు.మహ్మూద్ వేసిన ఐదో ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను అధిగమించాడు.
క్రిస్ గేల్ 301 వన్డే మ్యాచ్‌ల్లో 331 సిక్స్‌లు బాదగా..రోహిత్ శర్మ 335 సిక్స్‌లత కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.అతను 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స్‌లు కొట్టాడు.మరో 16 సిక్స్‌లు బాదితే హిట్ మ్యాన్ అతన్ని కూడా అధిగమించనున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు.30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్గా ఆయన నిలిచారు.ముప్పై ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ 36 సెంచరీలు బాదారు.ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (35) రికార్డును బ్రేక్ చేశారు.ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (26),విరాట్ కోహ్లి (19) ఉన్నారు.కాగా 16 నెలల తర్వాత ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శతకం బాదారు.
Nervous nineties? Woh kya hota hai? 😉#RohitSharma #INDvENGpic.twitter.com/qUlLPT48Bc
— Punjab Kings (@PunjabKingsIPL) February 9, 2025