ఇండో అమెరికన్ క్షమా సావంత్‌కు భారత్ అత్యవసర వీసాను తిరస్కరించింది.కాగా క్షమా సావంత్ మద్దతుదారులు అమెరికాలోని సియాటెల్ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.పలువురు ఆందోళనకారులు గుమికూడటంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని,స్థానిక అధికారులను పిలవాల్సి వచ్చిందని భారత కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.
అయితే కొంతమంది వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం చేశారని,వారిని ఎందుకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు భారత కాన్సులేట్ పేర్కొంది.వారు వెళ్లడానికి నిరాకరించారని వెల్లడించింది.సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని,బెదిరింపులకు దిగారని పేర్కొంది.శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో పోలీసులను పిలిపించినట్లు వెల్లడించింది.అయితే ఈమె అనేక ప్రసంగాల్లో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడేది.అలానే భారత వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనేది అని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేస్తున్నారు.