బెంగళూరులో నేటి నుండి 5 రోజుల పాటు ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా తదితర దేశాల ఫైటింగ్ జెట్ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. 30 దేశాల రక్షణ మంత్రులు, ప్రతినిధులు హాజరవనున్నారు. ఇక భారత రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా బెంగళూరు చేరుకున్నారు. భారత రక్షణ రంగం కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలతో పాటు దేశ ఆర్థిక సామర్ధ్యాన్ని కూడా పెంచుతుందని రాజ్ నాథ్ అన్నారు. స్వయం సమృద్ధి, ఆత్మ నిర్భరత, స్వాలంబనకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. మన రక్షణ రంగం ఉత్పాదన పరంగా రూ. 1.27 లక్షల కోట్లు, ఎగుమతుల్లో రూ.21 వేల కోట్లు దాటిందని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక షో గా నిలిచే ఈ షోకు ఈ సారి ‘రన్ వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్’ అన్న థీమ్ ను ఎంచుకున్నట్లు తెలిపారు.
బెంగళూరులో నేటి నుండి 5 రోజుల పాటు ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన
By admin1 Min Read
Previous Articleమిలటరీ పర్యవేక్షణలో ఛాంపియన్స్ ట్రోఫీకి భద్రత
Next Article 18 సంవత్సరాల వయసు లోపు వారికీ తమిళనాడులో జూదం నిషేధం