అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ లో నేడు భారత ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. దీనికి ముందు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోటులో విహరించారు. మహా కుంభమేళాకు వచ్చిన రాష్ట్రపతికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో దేశ, విదేశాల నుండి సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. దీనికి తగినట్లుగా యూపీ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
‘మహాకుంబమేళా’లో పుణ్య స్నానమాచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ
By admin1 Min Read