ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు నిన్న పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని,సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక,వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని,ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు.
అయితే మరోవైపు,భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ.. దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
VIDEO | Maha Kumbh 2025: Massive traffic in Prayagraj leads to chaos in public as devotees continue to arrive in large numbers to attend the Kumbh Mela.
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/NGuMUd1QNL
— Press Trust of India (@PTI_News) February 9, 2025