ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆయన కుమారుడు అకీరా నందిన్ కూడా ఉన్నారు. ఇక మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.
కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read