భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వ్యాపార పెరుగుదలకు అపార అవకాశాలు ఉంటాయని అన్నారు. 14వ ఇండియా ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశం రెండు దేశాలకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమంమని పేర్కొన్నారు. మీరంతా ఇన్నోవేషన్, కోఆపరేషన్, ఇంటిగ్రేషన్ మంత్రంతో పని చేయడాన్ని గమనిస్తున్నా. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతానికి చేస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో ఈ సమ్మిట్ కు అధ్యక్షత వహించడం సంతోషంతో ఉందని మోడీ అన్నారు. గత రెండేళ్లలో వీరిద్దరి మధ్య ఇది ఆరో సమావేశమని తెలిపారు. గతేడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు మేమిద్దరం ఏఐ యాక్షన్ సమ్మిట్ కు అధ్యక్షత వహించాం. గత దశాబ్దం నుండి భారత్ లో జరిగిన మార్పులు మీకు తెలుసు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా ‘ ‘మేక్ ఫర్ ది వరల్డ్’ ను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.
భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం:ఇండియా ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని మోడీ
By admin1 Min Read
Previous Articleరాంగోపాల్ వర్మ “శారీ” ట్రైలర్ విడుదల…!
Next Article ప్రధాని మోదీ విమానానికి బెదిరింపు కాల్…!