ఉచిత పధకాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచిత పధకాలు మంచిది కాదని దురదృష్టవశాత్తు వీటి వలన ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని పేర్కొంది.
ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలని ఉచితాల ద్వారా అలా జరుగుతోందా అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ఉచిత పధకాలు ప్రకటించే పద్దతి సరైంది కాదని ధర్మాసనం పేర్కొంది.
Previous Articleప్రధాని మోదీ విమానానికి బెదిరింపు కాల్…!
Next Article రోడ్లపై గుంతలు కనిపించకూడదు:- ఏపీ సీఎం చంద్రబాబు