ఏపీలో ఎక్కడా కూడా గుంతలున్న రహదార్లు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.అయితే గతంలో రహదార్లపైన ప్రయాణించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని,దాన్ని పోగొట్టి ఇప్పుడు మన ప్రభుత్వం రహదార్లను బాగు చేశామని,ఇప్పుడు రోడ్లు కాస్త అందంగా కనిపిస్తున్నాయని, ఇది సంతోషదాయకమన్నారు. అయితే ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని సూచించారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా…రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఇచ్చిన ప్రజంటేషన్ పైన మాట్లాడారు.జాతీయ రహదార్లపైన కూడా తనకు ఎక్కడా గుంతలు కనిపించకూడదన్నారు.కాగా రహదార్లకు మరమ్మతులు చేయడం,రోడ్లు నిర్మించడం ఒక్కటే కాదని,వాటి నిర్వహణ కూడా నిరంతరం సమర్థవంతంగా పని చేయని అన్నారు.అయితే మనం చేపట్టిన రోడ్లు నిర్మాణ పనులన్నీ కూడా 4 ఏళ్ళలో పూర్తి కావాలన్నారు.ఈ మేరకు అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడా గుంతలున్న రహదార్లు తనకు కనిపించకూడదని అన్నారు.