అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీల భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ట్యాక్స్ లు, వలసలు, ఇరుదేశాల వ్యూహం భాగస్వామ్యాలపై చర్చించినట్లు సమాచారం. చాలా కాలం నుండి మోడీ తనకు మంచి మిత్రుడని రానున్న రోజుల్లో కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా తమకు వనరులు ఉన్నాయని భారత్-అమెరికా మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయని అన్నారు. ఇరు దేశాలు కలిసి ఉండడం ముఖ్యమని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో పలువురు ప్రముఖులతో సమావేశాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి భారత్ పయనమయ్యారు.
భారత్-అమెరికా మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి: డొనాల్డ్ ట్రంప్
By admin1 Min Read