అమెరికా నుండి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు పంజాబ్ లో దిగడంపై ఆ రాష్ట్రంలో సీఎం భగవంత్ మాన్ కేంద్రంపై విమర్శలు చేసున్నారు.అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగా పంజాబ్ ను అపఖ్యాతిపాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? అని మాన్ ప్రశ్నించారు.ప్రధాని మోదీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధికారులు మనవారికి సంకెళ్లు వేసి ఉంటారని,ఇది మోదీకి ట్రంప్ ఇచ్చిన బహుమతా? అని నిలదీశారు.ఈ విమానాలు దిగడానికి అమృత్ సర్ ఎంపిక చేయడంలో ఏ విధానాన్ని అనుసరించారో విదేశీ వ్యవహారాల శాఖ చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్రమ వలసదారుల విమానాలు పంజాబ్ లో దిగడంపై సీఎం భగవంత్ మాన్ విమర్శలు
By admin1 Min Read