టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు థమన్కి కాస్ట్ లగ్జరీ కారు గిప్ట్ గా ఇచ్చాడు.అయితే బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్ సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ 4 చిత్రాలకు సంగీతం థమనే అందించాడు.దీనితో థమన్ నందమూరి థమన్ గా మారిపోయాడంటూ అప్పట్లో ట్రెండ్ అయ్యింది.
ఈ మేరకు బాలయ్య థమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.తమన్ కు 1.75 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ పోర్చే కారును బహుమతిగా ఇచ్చాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరిద్దరి కాంబోలో అఖండ 2 రాబోతుంది.ఈ క్రమంలో బాలయ్య తమన్ ను నందమూరి తమన్ అంటూ సరదాగా సంబోధించారు.