ఈనెల 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీలోని అన్ని శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుండి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. నేడు హైదరాబాద్ లో ఆయనను కలిసి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు.
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
By admin1 Min Read