అమెరికా నుండి 116 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్ లో దిగింది. భారత అక్రమ వలసదారులను అమెరికా నుండి పంపించడం ఇది రెండోసారి. ఈ నెల 5న 104 మందితో వచ్చిన విమానం కూడా అమృత్ సర్ లోనే దిగింది. తాజాగా భారతీయులతో వచ్చిన ఏసీ-17 విమానం గత రాత్రి 90 నిమిషాలు ఆలస్యంగా 11.35 గంటలకు ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్, వెరిఫికేషన్ వంటివి అయిన తర్వాత వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇక, 157 మందితో కూడిన మరో విమానం నేడు రానుంది.
తాజాగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు… నేడు రానున్న మరికొందరు
By admin1 Min Read