క్రికెట్ అభిమానులును వినోదాన్ని అందించడమే కాకుండా ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్న అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీని వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. అతనితో పాటు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాద్ ను కూడా ప్రజా సదన్ లో కలుసుకుని అభినందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రోత్సాహించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ వచ్చే నెల 22 నుండి ప్రారంభం కానుంది.
ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన తెలుగు తేజం త్రిపురాన విజయ్ కు కేంద్ర మంత్రి అభినందనలు
By admin1 Min Read
Previous Articleఏపీలో తొలి జీబీఎస్ మరణం….!
Next Article రేపు వంశీని కలవనున్న మాజీ సీఎం జగన్….!