కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,సామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో ఉన్న వైరంపై ఆయన అనవసర వ్యాఖ్యలు చేశారు.చైనాను శత్రు దేశంగా చూడవద్దు అని పిట్రోడా అన్నారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…చైనా నుండి ఎటువంటి సమస్య ఉందో అర్థం కావడం లేదని, అమెరికా ప్రమేయం వల్లే చైనాను శత్రువుగా చూస్తున్నారని పిట్రోడా తెలిపారు.
అయితే మన వ్యవహార శైలి ముందు నుంచీ వైరం పెట్టుకునే రీతిలో ఉందని,ఇలాంటి ప్రవర్తన వల్లే శత్రువులు తయారవుతారని,చైనా మన శత్రువు అనే ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పిట్రోడా అన్నారు.ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.చైనాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు…పిట్రోడా వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడంతో..బీజేపీ ఆ పార్టీని తప్పుపట్టింది. భారత్ తన భూభాగాన్ని చైనాకు సమర్పించిందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది.