రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు . అందినకాడికి అప్పులు చేశారని 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి… అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరింది. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికమని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన… pic.twitter.com/8y2vvPxtkR
— Lokesh Nara (@naralokesh) February 17, 2025