తాజాగా ‘అమరన్’ చిత్రంతో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ భారీ హిట్ అందుకున్నారు.అయితే శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది.అయితే ఈరోజు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ ను విడుదల చేసి,సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ చిత్రాన్ని లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Previous Articleప్రత్యేక సెట్ లో బాలయ్య “అఖండ – 2” చిత్రీకరణ…!
Next Article ఉక్రెయిన్ లో శాంతి చర్చల ప్రక్రియ వేగవంతం..!

