ఈనెల 19వ తేదీ నుండి మార్చి 1 వరకు జరగనున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.శ్రీనివాసరావు ఆహ్వానపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం
By admin1 Min Read