మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో త్రిష – ఆషిక రంగనాథ్ లు నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
ప్రస్తుతం చిరంజీవిపై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తునట్లు చిత్రబృందం వెల్లడించింది.ఈ సినిమాలో మెగా వారసులు నటిస్తున్నారు అని సమాచారం.ఇందులో నటుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారికా కొణిదెలా నటించనున్నారని వార్తలు విన్పిస్తున్నాయి.ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది.తాజాగా నన్ను ఏమి అడగొద్దు …నేను ఏమి చెప్పలేను…పట్టలేని సంతోషంలో ఉన్నాను అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది.